కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కొనసాగుతున్న ఉత్కంఠ

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆస్పత్రిలో చేరి నాలుగు రోజులు గడిచిపోవడంతో… కలైంజర్‌ ఆరోగ్యంపై డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కరుణానిధికి ఎలాంటి అపాయం లేదంటూ పార్టీ నేతలు, కావేరీ ఆస్పత్రి వర్గాలు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నా… డీఎంకే కార్యకర్తల్లో మాత్రం అనుమానాలు వీడటం లేదు.