హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్‌బోర్డ్ (వాటర్ బోర్డ్)లో వివిధ విభాగాల్లో 615 కొత్త పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
జనరల్ పర్పస్ ఎంప్లాయీస్ (జీపీఈ): 200
సీవరేజ్ విభాగం: 200
మేనేజర్లు: 80
అసిస్టెంట్ పీ అండ్ ఏ: 20
అసిస్టెంట్ ఎఫ్ అండ్ ఏ: 15
టెక్నికల్ గ్రేడ్ అసిస్టెంట్లు: 100
పై పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేశారు. నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.