చెల్లెలి ప్రేమను చూసి ప్రేమలో పడిన అక్క..చివరకు..

విశాఖకు చెందిన మైనర్‌ను పెళ్లి పేరుతో మోసం చేశాడో యువకుడు. దాదాపు 2 నెలలు కాపురం చేశాక.. బాలికను పుట్టింట్లో దించేసి కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టింది. విశాఖలో మొదలైన ఈ ప్రేమపెళ్లి కథ ఇప్పుడు గుంటూరు చేరింది. అబ్బాయిది గుంటూరు అని తెలియడంతో.. అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గతేడాది డిసెంబర్‌లో పూర్ణకు యుగేంద్రతో పరిచయం అయ్యింది. తనకు వరసకు చెల్లెలు అయ్యే అమ్మాయి- మరో అబ్బాయి ప్రేమించుకోవడం చూసిన పూర్ణ కూడా ప్రేమ పట్ల ఆకర్షితురాలైంది. ఆ టైమ్‌లో కలిసిన యుగేంద్రతో వెంటనే ప్రేమలో పడింది. ఈ ఏడాది జనవరి 20న వైజాగ్ బీచ్‌లో యుగేంద్ర-పూర్ణ పెళ్లి చేసుకున్నారు. వెంటనే ఇంట్లోంచి వెళ్లిపోయి ఓ అద్దింట్లో కొన్నాళ్లు కాపురం చేశామమని పూర్ణ చెప్తోంది. అప్పుడే పిల్లలు వద్దంటూ తనకు ఓసారి అబార్షన్ కూడా చేయించాడని అంటోంది. ఇంతలో.. ఉన్నట్టుండి యుగేంద్ర తనను పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడని కన్నీరుపెడుతోంది. ఇదే అదునుగా అతని స్నేహితుడు కూడా తనను లోబరుచుకోవడానికి ట్రై చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.