మిస్ ఫైర్ అయిన జగన్ అస్త్రం

miss-fire-on-jagan-kapu-reservation stategy

జగన్ ప్రజా సంకల్ప యాత్ర తర్పులోకి ఎంట్రీ ఇవ్వగానే రిజర్వేషన్లను తుట్టెను కదిల్చారు జగన్. రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని అంశమని..తాము ఏం చేయలేమని చేతులెత్తాశారాయన. కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న జోన్ కావటం..కొద్ది మంది యువకులు రిజర్వేషన్లకు సంబంధించి ప్ల కార్డులు ప్రదర్శించటంతో జగన్ ఇలా రియాక్ట్ అయ్యారు. తనను తాను నిజాయితీపరుడిగా చాటుకునేందుకు జగన్ వదిలిన ఈ అస్త్రం మిస్ ఫైర్ అయింది. చివరికి సొంత పార్టీలోని కాపు వర్గ నేతలకు కూడా జగన్ స్టేట్ మెంట్ మింగుడు పడలేదు. పవన్ వ్యక్తిగత విషయాలపై విమర్శలు..ఆ వెంటనే కాపు రిజర్వేషన్లపై స్టేట్ మెంట్..జగన్ ను ఆ సామాజిక వర్గానికి వ్యతిరేకమనే భావన తీసుకొచ్చాయి. ఇదే అదనుగా అటు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇలా అన్ని వైపుల నుంచి విమర్శలు రావటంతో..నష్ట నివారణ పనిలో పడ్డారు జగన్. పాదయాత్రంలో భాగంగా 225వ రోజున పీఠాపురానికి చేరుకున్న జగన్..రిజర్వేషన్లపై తన ప్రకటనకు సంబంధించి వివరణ ఇచ్చుకుంటూనే టీడీపీపై విరుచుకుపడ్డారు. తాము కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని..కాకపోతే దేశవ్యాప్త పరిస్థితులను కూడా అర్ధం చేసుకొవాలన్నారు.

దేశంలో జాట్లు, పటేళ్లు, గుజ్జర్లు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాయని గుర్తు చేశారు జగన్. అటు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని..అందువల్లే తాను ఖచ్చితంగా హామీ ఇవ్వలేని పరిస్థితులు వచ్చినట్లు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే..బీసీలకు అన్యాయం జరక్కుండా రిజర్వేషన్లకు తామ పార్టీ సిద్దమేనన్న జగన్..టీడీపీ మోసపూరిత ప్రచారాలతో పబ్బం గుడుపుకుంటోందని ఫైర్ అయ్యారు. తాను టీడీపీలా ప్రజలను మోసం చేయలేనని అన్నారు జగన్.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -