కవ్విస్తున్న ‘కంచె’ హీరోయిన్.. హాట్ పిక్స్..

ప్రగ్యా జైస్వాల్ ‘మిర్చి లాంటి కుర్రాడు’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో ఎవరికీ తెలియలేదు. అయితే అందులో ప్రగ్య నటన దర్శకుడు క్రిష్‌కి బాగా నచ్చేసి కంచెలో ఛాన్సిచ్చాడు. అందులో తన నటనతో అదరగొట్టేసిన ప్రగ్య వరుస ఆఫర్లు వస్తాయని ఆశించింది.

ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు లాంటి సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలకు అమ్మడు ఆశించినంత పేరు రాలేదు. మంచి హిట్స్ అందుకోకపోయిన అడపా దడపా సినిమాల్లో కనిపిస్తోంది.

తాజాగా అభిమానుల కోసం ఓ ఫొటో షూట్ చేసింది. అందులో హాట్ హాట్ ఫోజులిస్తూ కిక్కెస్తోంది. తన ఇన్‌స్టాగ్రాంలో ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.

స్టార్ హీరోయిన్ అయ్యే ప్రయత్నాల్లో భాగమే ఈ ఫొటో షూట్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.