ఎంపీ శివప్రసాద్ గెటప్పుల వెనుక కథ ఇది!

reason-behind-mp-shivaprasad-getups

చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ విచిత్ర వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.. ఏపీని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేస్తూ.. రోజుకో వేషధారణలో పార్లమెంట్‌కు వస్తూ తన నిరసన తెలియజేస్తున్నారు.. ఈ వర్షాకాల సమావేశాల్లోనూ ఆయన రోజుకో వేషంలో వస్తున్నారు.. మొదట అన్నమయ్య వేషధారణలో వచ్చి నిరసన తెలిపారు..

reason-behind-mp-shivaprasad-getups

తరువాత శంకరంబాడి సుందరాచారి వేషధారణలో వినూత్నంగా నిరనస తెలిపారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ.. తరహాలో కేంద్రానికి హితోపదేశం చేశారాయన. తెలుగు జాతికి ద్రోహం చేయొద్దని గీతాలాపన చేశారు.

reason-behind-mp-shivaprasad-getups

మూడో రోజు రాయలసీమ హక్కుల కోసం పోరాడిన ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి వేషధారణలో పార్లమెంట్‌కు వచ్చారు శివప్రసాద్‌. సైరా అంటూ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డితో పాటు నినాదాలు చేశాలి.. అందరి దృష్టినీ ఆకర్షించారు..

reason-behind-mp-shivaprasad-getups

నాలుగో రోజు బ్రిటీష్‌ కాలానికి చెందని కాటన్‌ దొర వేషధారణలో వచ్చారు. బ్రిటీష్ వ్యక్తైన కాటన్‌ దొర ఏపీ ప్రజల కోసం ప్రాజెక్టులు కడితే.. భారతీయుడైన మోడీ మాత్రం ఏపీని నిర్లక్ష్యం చేస్తున్నారని శివ ప్రసాద్‌ మండిపడ్డారు..

reason-behind-mp-shivaprasad-getups

ఐదో రోజు కుప్పం- కంగుంది.. వీధినాటకం కళాకారుల వేషధారణలో పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు శివప్రసాద్‌.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ 5 కోట్ల మంది ప్రజలు ఉద్యమిస్తున్నా.. కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని శివప్రసాద్ మండిపడ్డారు.

reason-behind-mp-shivaprasad-getups

ఆరో రోజు.. ఇవాళ పుటపర్తి సత్యసాయి బాబ వేషధారణలో సభకు వచ్చారు ఎంపీ శివప్రసాద్‌. సత్యం, ధర్మం, న్యాయం, మానవతా విలువలు లేని వ్యక్తి మోడీ అంటూ విమర్శించారు.

ఈ విధంగా వివిధ వేషధారణలతో వెళితే.. కనీసం ఈ విధంగా అయినా పాలకుల్లో, అధికారుల్లో మార్పు వస్తుందన్న ఆశతో, ప్రజలకు న్యాయం జరుగుతుందన్న ఆపేక్షతో ఎంపీ శివప్రసాద్ ఇలా చేస్తున్నారు