మరో బురారీ…జార్ఖండ్‌లో మరో విషాదకర ఘటన

ఢిల్లీలో బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటనను మర్చిపోకముందే ఝార్ఖండ్‌లోని రాంచీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Seven of family commit suicide in Ranchi - Sakshi

రాంచీకి చెందిన దీపక్‌ ఝా, అతని భార్య సోనీ ఝా, రూపేష్‌ ఝా, దీపక్‌ కుమార్తె దృష్టి, గంజుతోపాటు మరో ఇద్దరు రాంచీలోని వారి నివాసంలో ఉరివేసుకుని సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. సోమవారం ఉదయం దీపక్‌ కూతురిని తీసుకెళ్లడానికి వచ్చిన స్కూలు వ్యాన్‌ ఎంత సేపు వేచి ఉన్నా ఇంట్లోంచి ఎవరూ రాలేదు. పిలిచేందుకు వెళ్లిన ఒక బాలిక తలుపు తీయగా ఈ దారుణం వెలుగుచూసింది.

Police officers at the house in Ranchi on Monday where seven members of a family allegedly committed suicide.

సోదరులిద్దరూ ఉరివేసుకోగా, మిగిలిన ఇంటి సభ్యుల శరీరాలు మంచంపై పడి ఉన్నాయి. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని.. అప్పుల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. గడచిన పదిరోజుల్లో జార్ఖండ్‌లో ఇది రెండో సామూహిక ఆత్మహత్య కావడం గమనార్హం. జూలై 15న హజారీబాగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకంతకూ పెరుగుతున్న ఈ సామూహిక ఆత్మహత్యల పట్ల స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Image result for Seven of family commit suicide in Ranchi