తారామణికి సెన్సార్ నో

taramani movie has no sensor

అంజలి, ఆడ్రియా లీడ్ రోల్స్ చేసిన తారా మణి యూత్ కి పిచ్చెక్కిస్తుంది. ముఖ్యంగా ఆండ్రియా క్యారెక్టర్ మోట్రో కల్చర్ కి రిఫరెన్స్ గా కనిపిస్తుంది. హాట్ హాట్ సీన్స్ తో ఈ సినిమా పుల్ గా లోడ్ అయ్యిందని టాక్. ట్రైలర్ కే విపరీతమైన రెస్సాన్స్ వచ్చింది. ఇలాంటి కాన్సెప్ట్ లను బోల్డ్ చేయడం, చూడటం బాలీవుడ్ కి అలవాటే. వీర్ దే వెడ్డింగ్ కూడా ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ తోనే వచ్చి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయినా కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉండటంతో, సెన్సార్ కత్తెరకు పనిచెప్పిందట. అయితే ఆ సీన్స్ ని తీయడం వీల్లేదని నిర్మాత డి.వెంకటేష్ పట్టు బడుతున్నట్లు సమాచారం. మరి తారామణి సెన్సార్ వారికి చెమటలు పట్టిస్తే.. సినిమా రిలీజ్ అయితే ఎలాంటి వివాదాలకు కారణం అవుతుందో అని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.