పార్టీకి పిలిచి.. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. ఆపై..

రోజు రోజుకి ఆడపిల్లలపై పెరుగుతున్న అత్యాచారాలు.. కామాంధుల భారినుంచి తప్పంచుకోలేక బలైపోతున్న బాలికలు.. అవగాహన ఎంత కల్పిస్తున్నా అమాయకులు బలవుతూనే ఉన్నారు. మహారాష్ట్రలోని పూణేలోని ఎరవాడ స్కూల్లో 11వ తరగతి చుదువుతున్న అమ్మాయి గత ఏడాది డిసెంబర్‌లో స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లింది. అందరూ పార్టీని బాగా ఎంజాయ్ చేశారు. పార్టీకి వచ్చిన అబ్బాయి వెంట తెచ్చుకున్న మత్తు మందుని కూల్ డ్రింకులో కలిపి ఈ అమ్మాయికి ఇచ్చాడు. అది తాగిన అమ్మాయి మత్తుగా పడిపోయింది. పార్టీ అయిపోయిన తరువాత స్నేహితులందరూ వెళ్లిపోయారు. ఆ అమ్మాయిని మాత్రం నేను డ్రాప్ చేస్తానంటూ మత్తు మందు కలిపిన అబ్బాయి అనడంతో సరేనంటూ మిగిలిన వాళ్లు వెళ్లిపోయారు. మత్తులో ఉన్న ఆమెపై అతడు అత్యాచారం చేసి ఆపై వీడియోలో రికార్డ్ చేశాడు.

మత్తు నుంచి తేరుకున్న ఆమె తనపై జరిగిన అన్యాయం తెలుసుకుని షాక్‌కి గురైంది. వీడియో పేరు చెప్పి భయపెట్టడంతో అమ్మానాన్నకి చెప్పలేకపోయింది. ఆఖరికి స్నేహితులతో కూడా తన బాధను పంచుకోలేకపోయింది. ఇది అదనుగా తీసుకుని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగడుతూ నాలుగు నెలలుగా తన కామదాహాన్ని తీర్చుకుంటున్నాడు ఆ కామాంధుడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి గర్భం దాల్చింది. రెండు రోజుల క్రితం తీవ్ర రక్త స్రావం కావడంతో తల్లి హాస్పిటల్‌కు తీసుకువెళ్లింది. వైద్యులు పరీక్షించి గర్భస్రావం అయిందని చెప్పారు. దీంతో షాక్ తిన్న తల్లి అమ్మాయిని ప్రశ్నించగా తనపై జరుగుతున్న అత్యాచారాన్ని వివరించింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడిని అరెస్టు చేశారు.