అరుదైన హనుమంతుడు.. సేదతీరుతున్నాడు..

bhadra-maruti-hanuman-viral-news

ఎక్కడైనా హనుమంతుడు నిలబడి ఉండే ప్రతిమలు చూశాం..కానీ సీదతీరుతున్న హనుమంతుడి ప్రతిమను ఇంతవరకుచూడనే లేదు.. తాజగా సీదతీరుతున్న అరుదైన ఆంజనేయుడి విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ విగ్రహంలో ఆంజనేయుడు ఒక ప్రక్కకు వాలి కళ్ళతో పైకి చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు.

హనుమంతుడి విగ్రహం ఈ పొజిషన్లో ఎక్కడా కనపడదు.. అయితే ఈ తరహా హనుమంతుడి విగ్రహం ఔరంగాబాద్ లోని కుళ్దబాద్ లో భద్ర మారుతీ ఆలయంలో ఉంది.హనుమంతుడు విశ్రాంతిగా ఉన్న ఏకైక ప్రదేశం ఈ ఆలయమే కావడంతో భక్తులు ఇక్కడికి తరలివస్తారు. హనుమంతుడు సేదతీరుతున్న ఫోటోను కొందరు సామజిక మాధ్యమాల్లో షేర్ చెయ్యడంతో వైరల్ గా మారింది.