హరిద్వార్‌ యాత్రకు బయలుదేరనున్న గోల్డెన్‌ బాబా

golden-baba-is-back-on-kanwar-yatra-this-time-with-20-kg-gold-see-pics

గోల్డెన్‌ బాబా మరోసారి వార్తల్లో నిలిచారు. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి.. హరిద్వార్‌ యాత్రకు బయలుదేరనున్నారు. గోల్డెన్‌ బాబాగా పేరొందిన సుధీర్‌ మక్కర్‌ ప్రతి ఏటా హరిద్వార్‌ నుంచి ఢిల్లీ వరకూ సాగే కన్వర్‌ యాత్రలో పాల్గొంటారు. అందులో భాగంగా మరోసారి ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 20 కిలోల బంగారు ఆభరణాలను ధరించే గోల్డెన్‌ బాబా ఈ ఏడాది సాగే 25వ కన్వర్‌ యాత్రలోనూ పాల్గొంటున్నారు. యాత్రలో పాల్గొనే ముందు బాబా కాషాయ దుస్తుల్లో, భారీ జ్యూవెలరీతో ఉత్తరాఖండ్‌లో మెరిశారు. 200 కిలోమీటర్లు యాత్ర ఆద్యంతం ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగనున్నారు.

మొదట వ్యాపారం చేసుకుంటూ జీవించిన ఆయన.. ఇప్పుడు స్వామీజీగా మారారు. అయితే ఇదే తనకు చివరి యాత్ర కావచ్చని ఆయన చెబుతున్నారు. ఈ సారి యాత్రలో తాను ఎక్కువ బంగారు ఆభరణాలను ధరించనని, వాటి బరువు కారణంగా తన మెడనరాలు దెబ్బతింటున్నాయని, ఓ కంటి చూపు కూడా మందగించిందని తెలిపారు. కొత్త బంగారు చైన్‌ రెండు కిలోలుండగా, శివ లాకెట్‌ కూడా బరువైనదేనని చెప్పారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -