అంకుల్.. మీరు సామాన్యులు కారు…

వంట చేసేటప్పుడు కాగుతున్న నూనెలో పోపు గింజలు వేయాలంటే నూనె చిందులు ఎక్కడ పడతాయోనని స్టౌకి దూరంగా జరిగేస్తుంటాం. మరి అలాంటిది ఈ అంకులేంటి సలసల కాగుతున్న నూనెలో చేపముక్కల్ని వేసి అవి వేగిన తరువాత గరిటెతో తీసినంత అలవోకగా చేత్తో తీసేస్తున్నారు. సైన్స్ ప్రకారంగా బాగా కాగిన నూనెలో చేతులు పెట్టినా కాలవంటారు. అదెంత వరకు నిజమో కానీ అంత సాహసం చేయాలంటే అంకుల్‌కి ఉన్నంత ధైర్యం మాత్రం కావాలి.

ఓసారి కాగుతున్న నూనెలో చెయ్యి పెట్టి చూసారట. ఆయనకి ఏమీ అనిపించకపోవడంతో అదే కంటిన్యూ చేస్తున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా ఈజీగా ఈపని చేసేస్తున్నారు. ఉదయం నుంచి సాయింత్రం వరకు దుకాణానికి వచ్చే కస్టమర్లకు వేడివేడి చేపముక్కల్ని తన చేతులతో అందిస్తుంటారు. వచ్చిన కస్టమర్లు రుచికరమైన చేపముక్కలతో పాటు ఆయన చేస్తున్న సాహసాన్ని కళ్లప్పగించి చూస్తుండిపోతారు. ఈ విధంగా కూడా షాపుకి వచ్చే కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో బిజినెస్ ‌కూడా పెరిగింది. అంకుల్ చాలా గ్రేట్.. కానీ మీరు మాత్రం ఆ పని చేయకండేం.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -