కిక్కి ఛాలెంజ్ .. కదులుతున్న కారుతో పాటు డ్యాన్స్.. కొత్త ట్రెండ్

Kiki Challenge goes viral on social media

ఫిట్ నెస్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ ల తరహాలో కిక్కి చాలెంజ్ లు విసురుకుంటున్నారు సెలబ్రిటీలు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.. కదులుతున్న కారును అనుసరిస్తూ డ్యాన్స్ చెయ్యాలి.. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను పలువురు సెలబ్రిటీలు అనుసరిస్తున్నారు.


అందులో ముఖ్యంగా టాలీవుడ్ హీరోయిన్లు ముందు వరుసలో ఉన్నారు. రెజినా, ప్రణీత ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మరికొందరికి నామినేట్ చేశారు.ప్రస్తుతం ఈ ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఫేమస్ పర్సన్స్, సెలెబ్రిటీలు, సినిమా హీరోలు ఈ ఛాలెంజ్ లో పాలుపంచుకున్నారు.

ఇక ఈ ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది. కొంతమంది యువకులు రోడ్లపై కదులుతున్న కార్ల పక్కన డ్యాన్స్ చేస్తున్నారు. దీంతో ఈ విన్యాసాలపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. కార్ల పక్కన డ్యాన్స్ లు చేయడం క్షేమం కాదని, వాహనాలు నడుపుతున్న వారితో పాటు అందులో ప్రయాణిస్తున్న వారికి, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ఇది ప్రమాదమని పోలీసులు అంటున్నారు. కిక్కి చాలెంజ్‌ పేరుతో ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసే వారిని హెచ్చరిస్తున్నారు.