సెల్‌ఫోన్‌ పేలి వ్యక్తి మృతి

Remove term: man died by cellphone blast man died by cellphone blast

సెల్‌ఫోన్‌ పేలుడు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. కనిగిరి మండలం వాగుపల్లిలోకి చెందిన సంగు మస్తాన్‌రెడ్డి (31) పాక్షిక దివ్యాంగుడు, అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. కాగా సోమవారం రాత్రి మస్తాన్‌రెడ్డి తన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలాగే తన ఫోన్ ను పొట్టమీద పెట్టుకున్నాడు. దాంతో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఫోన్‌ పేలింది. మస్తాన్‌రెడ్డి ఇంటిలోనుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు గమనించి ఇంటి తలుపు తెరిచి చూడగా మస్తాన్‌రెడ్డి చనిపోయి ఉన్నాడు. విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వాగుపల్లిలోని పలు గృహాల్లో టీవీలు, లైట్లు కాలిపోయాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంటివద్దే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నాడు. ఇటీవల అతని చెల్లికి కూడా వివాహం చేశాడు.ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్థులు.