స్వల్ప లాభాలతో- చిన్న షేర్లు ఖుషీ!

పటిష్ట లాభాలతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 36 పాయింట్లు పుంజుకుని 37,643కు చేరగా.. నిఫ్టీ 22 పాయింట్లు బలపడి 11,379 వద్ద ట్రేడవుతోంది. కాగా.. చిన్న షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.5 శాతం చొప్పున ఎగశాయి.


లాభపడ్డవే అధికం
బీఎస్ఈలో ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1295 లాభపడగా.. 798 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. మిడ్‌ క్యాప్స్‌లో ఆర్‌కామ్‌, ఏబీ ఫ్యాషన్, ఎంఫసిస్‌, గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, సన్‌టీవీ, గృహ ఫైనాన్స్‌, భారత్‌ ఫోర్జ్‌, దివీస్‌ లేబ్‌, యూబీఎల్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, వొకార్డ్‌ 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. ఇక స్మాల్‌ క్యాప్స్‌లోనూ క్యుపిడ్‌ 20 శాతం దూసుకెళ్లగా, వీఎల్‌ఎస్‌, కెపాసైట్‌, కైటెక్స్‌, ఓరియంట్‌, డోనియర్‌, జేకే పేపర్‌, జాగరణ్‌, రిలాక్సో, కేఈసీఎల్‌, నిట్కో, పేపర్‌ ప్రొడక్ట్ష్‌, ఆంధ్రా షుగర్‌, ద్వారికేష్, పటేల్‌, మ్యాక్స్‌, ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌, బటర్‌ఫ్లే, ఎపెక్స్‌, 8కే మైల్స్‌ తదితరాలు 12-5 శాతం మధ్య జంప్‌చేశాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -