సైరా షూటింగ్‌కి బ్రేక్.. సెట్స్ కూల్చివేత..

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో సైరా పేరుతో తెరకెక్కుతున్న చిత్రం ఆది నుంచి ఆటంకాలనెదుర్కుంటూ షూటింగ్ సాగుతోంది. మొన్నటికి మొన్న వర్షం కారణంగా బ్రేక్ పడింది.

అంతకుముందు చిత్ర కథానాయకుడు చిరు అమెరికా వెళ్లడంతో అప్పుడొకసారి వాయిదా పడింది. తాజాగా మళ్లీ ఇప్పుడు బ్రేక్ పడింది. కారణం రెవెన్యూ సిబ్బంది అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో షూటింగ్‌కి సంబంధించిన సెట్టింగ్స్ ఏర్పాటు చేయడంగా చెబుతున్నారు అధికారులు.

 

10 మంది రెవెన్యూ అధికారులు స్పాట్‌కు వచ్చి సిబ్బంది సహాయంతో ఇంటి సెట్‌ను పడగొట్టారు. దీంతో షూటింగ్ వాయిదా వేయక తప్పని పరిస్థితి. ఇంతకుముందు రామ్ చరణ్ నటించిన రంగస్థలం సెట్ వేసింది ఈ స్థలంలోనే. మరి ఇప్పుడు ఇబ్బందులు ఎందుకు వచ్చాయని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

తమ కథానాయకుడి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి చిత్ర నిర్మాణం ఇలా బ్రేకులతో సాగుతుండడం కొంత నిరాశకు గురిచేస్తోంది.