అర చేతిలో అద్భుతం అంటే ఇదేనేమో..!

vietnam-golden-bridge

అర చేతుల్లో అద్భుతం.. ఈ మాట ఎప్పుడూ వినడమేగాని చూసింది లేదు. కానీ వియత్నాంలోని ఓ రిసార్ట్‌ అరచేతిలో అద్భుతాన్ని చూపిస్తోంది.. వియత్నాం ప్రభుత్వం ఇటీవల ఓ సుందరమైన వంతెనను నిర్మించారు. అయితే అది మామూలు వంతెన కాదు..దాన్ని ఓ పే…ద్ద అరచేతిలో ఉన్నట్టుగా నిర్మించారు. అలాగే రిసార్ట్ చుట్టూ అందమైన కొండలు, అందులో పూలతోటలు చూస్తే ఎవరైనా ఆహా.. అనక తప్పదు.. పైగా దూరం నుంచి చూసే వారికి ఇంత పెద్ద భారీ వంతెనను పడిపోకుండా ఈ రెండు చేతులు కాపాడుతున్నాయేమో అని అనిపిస్తుంది. ‘గోల్డెన్‌ హ్యాండ్స్‌’ అని పిలుచుకుంటున్న ఈ వంతెనను చూడటానికి రోజూ వేలాదిమంది సందర్శకులు తరలివస్తారు.

vietnam-golden-bridge

ఈ ‘గోల్డెన్‌ హ్యాండ్స్‌’ వంతెనను సముద్ర మట్టానికి సుమారు 4593 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీనికి ఇరువైపులా లోబిలియా చామంతి పూల మొక్కలను నాటారు. ఈ పూలను దూరం నుంచి స్వర్గలోకాన్ని తలపిస్తాయి. అంతేకాకుండా కొండలమధ్య ఉన్న ఈ వంతెనను దూరంనుంచి చూసినప్పుడు అడవిలో నుంచి రెండు భారీ చేతులు వచ్చి ఈ వంతెనను పట్టుకున్నాయేమో అనిపిస్తోంది.

vietnam-golden-bridge

దాదాపు ఏళ్ల తరబడి ఈ వంతెనను నిర్మించారు. ఈ ఏడాది జూన్ లో దీనిని ప్రారంభించారు. కాగా ఈ వంతెన నిర్మాణం కోసం వియత్నాం ప్రభుత్వం దాదాపు 10 వేలకోట్ల రూపాయలను కేటాయించింది. కేవలం పాదచారులు మాత్రమే ఈ వంతెన ఎక్కడానికి అనుమతిస్తారు. వంతెన ఎక్కి ఆకాశం వైపు చూసే వారికీ అది నింగి అందుతుందేమోనన్న అనుభూతి కలుగుతుంది. ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులు ఈ వంతెనను చూడటానికి వస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -