పాము కుబుసం ఎప్పుడు విడుస్తుందంటే..

why-snakes-shed-their-skin-by-brandon-cornett

పాముకు గుడి కట్టేందుకు సిద్ధమవుతున్న తూర్పుగోదావరి జిల్లా దుర్గాడ గ్రామప్రజలు.. భక్తిశ్రద్దలతో పూజలు మొదలుపెట్టారు. ఇటీవల దుర్గాడ గ్రామానికి చెందిన రైతు వీరబాబు పొలంలోకి ఓ త్రాచుపాము రాగా దాన్ని పట్టుకుని వేరే ప్రాంతంలో వదిలి వచ్చినా. తిరిగి ఆ పాము మళ్ళీ అదే పొలంలోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ పామును సుబ్రమణ్యస్వామిలా భావించి పూజలు చెయ్యడం మొదలు పెట్టారు. అంతేకాకుండా గుడి కూడా కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది అటుంచితే ఆ పాము ఇప్పుడు కుబుసంవిడిచింది. అయితే ఇది ప్రకృతి పరంగా జరిగిందా? మహత్యమా? అని జనం తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు.

why-snakes-shed-their-skin-by-brandon-cornett

వాస్తవానికి పాము కుబుసం విడిచే ప్రక్రియ ఎప్పుడూ జరిగేదే.. ప్రతీ పాము ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి కుబుసాన్ని వదిలేస్తుంది . పాముల చర్మము నీటిని బయటకు పోనివ్వని పొలుసులను కలిగి ఉంటుంది . పొలుసుల తో కూడిన చర్మము పెరుగదు.. లోపలవున్న శరీరం మాత్రమే పెరుగుతుంది. కాబట్టి పై చర్మమును వదిలించుకునే ప్రక్రియనే కుబుసం వదలడం అంటారు. అయితే ఈ ప్రక్రియ కొత్త చర్మం తయారయ్యకే మొదలవుతుంది. అయితే ఈ పామును చూడటానికి వచ్చిన భక్తుల అభిప్రాయాలు మాత్రం మరోలా ఉన్నాయి. పాములు ఎవరూ లేని ఒంటరి ప్రదేశాల్లో మాత్రమే కుబుసాన్ని వదులుతాయి. అలాంటిది ఈ పాము జనం మధ్యనే కుబుసాన్ని వదిలింది.. ఇందులో సుబ్రమణ్య స్వామి మహిమ ఉండక మానదు అని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.