అబ్బా.. మేము చూడలేదు లే..

car-and-bike-accident-incident-recording-in-cc-cemara

రాను రాను ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. రాంగ్ రూట్ లో రావడంతో ఓ కారు ప్రమాదానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కారు ప్రయాణికులతో వెళుతుండగా.. రోడ్డుకు అడ్డంగా బైక్ డ్రైవ్ చేసుకుంటూ మరొక వ్యక్తి వస్తున్నాడు. దీంతో ఆ కారు బైక్ ను ఢీకొట్టింది. అయితే కారు బోల్తా పడి అందులోని ప్రయాణికులు గాయపడ్డారు. విచిత్రమేమిటంటే బైక్ డ్రైవర్ కు చిన్న గాయం కూడా కాలేదు.ఈ క్రమంలో వారిని కాపాడాల్సిన బైక్ డ్రైవర్ గాయాలైన వారి ఆర్తనాదాలు విని భయపడ్డాడు. వారు లేస్తే దాడి చేస్తారేమోనని ఖంగారు పడి.. బైక్ పక్కనే పడుకున్నాడు. ఇంతలో ప్రమాదాన్ని గ్రహించిన ఓ ఆటో డ్రైవర్ క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశాడు.కాగా ఈ ఘటనంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.