26 రోజుల పాటు పూజలందుకుని పాము మృతి

dhurgada-snake-died

దేవుడిగా భావించి 26 రోజుల పాటు పూజలందుకున్న పాము మృతి చెందింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో ఓ పామును.. అక్కడి ప్రజలంతా సుబ్రహ్మణ్యస్వామిగా భావించి.. పూజించారు. అయితే 26 రోజుల తరువాత.. కుబుసం విడిచిన వెంటనే.. పాము కన్నుమూసింది. దీంతో గ్రామస్తులంతా కన్నీరు పెడుతున్నారు. పాము ఇంతకాలం ఉన్న పొలంలోనే గుడి కట్టి.. విగ్రహ ప్రతిష్ట చేయాలని గ్రామాస్తులు భావిస్తున్నారు..

dhurgada-snake-died

ఇన్ని రోజులూ పాము పొర విడకపోవడంతో నే పూర్తిగా కదల్లేని స్థితిలో ఒకే ప్రదేశంలో ఉండిపోయిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆహారం ఏమీ తీసుకోకపోవడం, భక్తులు పూజల పేరుతో పాలు, కొబ్బరినీళ్లు, పసుపు, కుంకుమ వంటివి వేయడంతో.. అనారోగ్యానికి గురైందని వెటర్నీ డాక్టర్లు వెల్లడించారు.

dhurgada-snake-died

నాగు పాముని పూర్తిగా పరిశీలించిన తరువాత ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్యం సమస్య లేదని వైద్యులు నిర్ధారించారు. అయితే కుబుసం విడిచిన తరువాత పాము చురుగ్గా ఉంటుందని వైద్యులు తెలిపారు. పాము కుబుసం విడవడంతో ఓ బాక్స్‌లో బంధించేందుకు అటవీ అధికారులు ప్రయత్నించారు. కానీ గ్రామస్థులు అడ్డుకోవడంతో.. అటవీ అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు..

dhurgada-snake-died

కానీ కుబుసం విడిచిన కొన్ని గంటల్లోనే ఆ పాము మృతి చెందింది. ఇన్నాళ్లూ దేవుడిగా పూజించిన పాము మరణించడంతో.. చూసేందుకు గ్రామస్తులంతా క్యూ కడుతున్నారు. చనిపోయిన పామును చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. దేవుడు గ్రామం విడిచి వెళ్లిపోయాడాంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

dhurgada-snake-died