బంగారం ధర తగ్గిందోచ్..

మగువల మనసు దోచే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్లున్న పది గ్రాముల బంగారం ధర రూ.31,790లు ఉండగా అది ఈ రోజు రూ.40 తగ్గి రూ.31,750కి వచ్చింది. 8 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32 తగ్గి రూ.25,400 గా పలుకుతోంది. ప్రధాన మెట్రో నగరాల్లో అయితే 22 క్యారెట్ల బంగారం ధర రూ.27,750 కే లభిస్తోంది.

దేశ‌వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.28,300 కు లభిస్తే, చెన్నైలో రూ.28,300కు, ముంబైలో రూ.29,070 ధర పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌, చెన్నైలో రూ.31,110 కాగా ముంబైలో రూ.31,750 ధర పలుకుతోంది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -