నెల్లూరు జిల్లాలో ఐటీఐ స్టూడెంట్ దారుణ హత్య..

నెల్లూరు జిల్లా కావలి ఇందిరానగర్‌లో దారుణహత్య జరిగింది. భార్గవ్ అనే యువకుడిని ప్రత్యర్థులు ఇంటికొచ్చి మరీ చంపేశారు. రాత్రి నిద్రపోతున్న అతన్ని ఇంట్లోంచి బయటకు లాక్కుని వచ్చి.. తీవ్రంగా కొట్టి హత్య చేసి పరారర్యారు.. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే చనిపోవడంతో కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు.

స్థానిక జీడీ నాయుడు కాలేజీలో భార్గవ్ ఐటీఐ చదువుతున్నాడు. అతనిపై ఇలా దాడి చేయడానికి కారణం ఎవరు, కాలేజీ గొడవల వల్లే హత్య చేశారా, లేక మరేదైనా కారణం ఉందా అన్నది ఇప్పటికైతే మిస్టరీగానే ఉంది.