ఆ కక్కుర్తితో రూ.8 వందల కోట్లు పోగొట్టుకున్నాడు.. కారణం తెలుసా?

man loss 800 crores,

కోటీశ్వరులు కావాలంటే మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. కొన్ని ఏళ్ల శ్రమపడితే కానీ ఆ స్థాయికి చేరలేరు. అంత సంపాదించిన సొమ్ము భద్రంగా దాచుకోవడం అత్యంత సహజం. ఐతే వందల కోట్లు సొమ్ము పోగేసుకున్న తర్వాత మాత్రం బుద్ది పెడదారులు పడుతుంది. పన్ను ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచిస్తుంటారు కొందరు. ఆ కోవకి చెందిన ఓ వ్యక్తి తన కక్కుర్తితో దాదాపు రూ.800 కోట్లు పోగొట్టుకున్నాడు.

కర్నాటకలో బోరింగ్ ఇన్సిట్యూట్ ఆనే స్పోర్ట్స్ క్లబ్ ఉంది. అందులో అవినాష్ అమర్‌లాల్ కుక్రేజా అనే వ్యక్తి శాశ్వతసభ్యుడు. ఇతగాడు బెంగళూరులో పైనాన్షియర్ కావడంతో పాటు వ్యాపారాలు కూడా చేస్తుంటాడు. బాగా సొమ్ము సంపాదించిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు, ఏ బ్యాంకులోనో డిపాజిట్ చేస్తారు, లేదంటే ఇతర వ్యాపారాల్లోనో, ప్రభుత్వరంగ డిపాజిట్లు, పథకాల్లో పెట్టుబడి పెడతారు. వాటిలోనూ పన్ను మినహాయింపు పథకాలు ఉన్నాయి కాబట్టి సక్రమంగా ఆలోచించేవారు వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అవినాష్ అమర్‌లాల్ మాత్రం ఈ సొమ్ముకి ఎందుకు లెక్కలు చెప్పాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఓ ప్లానేశాడు. అదేమిటంటే, స్పోర్ట్స్ క్లబ్‌లో లాకర్లు ఉంటాయి. క్రీడాకారులు, అక్కడికి రెగ్యులర్‌గా వచ్చిపోయేవాళ్లకి సంబంధించిన వస్తువులు, ఆటసామాగ్రి పెట్టుకోవడానికి ఇవి వాడుతుంటారు. ఇతగాడు కూడా మూడు లాకర్లు తీసుకున్నాడు. అందులో తనకి సంబంధించిన బంగారం, డబ్బు, ఆభరణాలు పెట్టుకున్నాడు. వాటికి నెలనెలా, లాకర్‌కి యాభై రూపాయల చొప్పున నూట యాభై రూపాయలు కట్టడం ప్రారంభించాడు.

కొన్నాళ్ల తర్వాత తానే మెంబర్‌ని అనే ధీమాతోనో..ఇంకో కారణంతోనో ఈ అద్దె కట్టడం మానేశాడు. స్పోర్ట్స్ క్లబ్ మేనేజ్‌ చేసే సిబ్బంది రెంట్ పే చేయమని అడిగినా స్పందించలేదు. ఇలా కాదని విసిగిపోయిన సదరు సిబ్బంది ఈ లాకర్లను తెరిచి వస్తువులు బైటపడేసి ఇతరులకు కేటాయిద్దామని అనుకున్నారు.కానీ లాకర్లు ఓపెన్ చేసేసరికి అందరూ షాక్ తిన్నారు..ఒకటా రెండా రూ.800కోట్లు..నిలువు గుడ్లు పడిపోయాయ్ అందరికీ. ఇలా చేసారేంటి..మన లాకర్లు డబ్బు బంగారం పెట్టుకోవడానికి కాదు కదా అని అవినాష్ అమర్‌లాల్‌కి ఫోన్ చేశారు.విషయం బైటపడటంతో..మీకూ కొద్దిగా డబ్బు ఇస్తా , కావాలంటే ఓ ఐదుకోట్ల రూపాయలు ఇస్తా గప్‌చిప్‌గా ఉండండి అని ఆఫర్ చేశాడు..ఐనా వాళ్లు ఆ ప్రలోభాలకు లొంగకుండా ఆదాయపు పన్ను అధికారులకి సమాచారం ఇచ్చారు. దీంతో విషయం కాస్తా సంచలనమైంది.

ఇప్పుడు అవినాష్ వెనుక బిజెపినేతలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బోరింగ్ ఇన్సిట్యూట్ కమిటీ అవినాష్ అమర్‌లాల్ సభ్యత్వం రద్దు చేయడానికి సిధ్దమైంది.ఐతే అతను మాత్రం క్లబ్ కమిటీ ముందు హాజరై సంజాయిషీ ఇచ్చేందుకు 15 రోజులు గడువు కోరాడట. తమకి సంబంధించిన బ్యాడ్మింటన్ కోర్టు లాకర్లని ఇలా దుర్వినియోగం చేయడంతో క్లబ్ యాజమాన్యం ఆందోళన చెందుతోంది. తమ క్లబ్ ఇలా అక్రమాలకు తావిస్తుందనే పేరు చెరుపుకునేందుకు ఈ దర్యాప్తు చేపట్టింది. గోవా, కర్నాటక ఆదాయపు పన్ను సిబ్బంది మరోవైపు ఈ కేసులో విచారణ సాగిస్తుండగా..ఇది అదనం అన్నమాట. వివిధ సైట్లు, వాట్సాప్‌లో ప్రచారమవుతున్నట్లు అవినాష్ ఊరూ పేరూ లేని వ్యక్తి కాదు. అసలు క్లబ్‌లో పర్మినెంట్ మెంబర్. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భాగస్వామి కూడా. అందుకే ఇతనికి సన్నిహితంగా మెలిగే చాలామంది వ్యక్తుల ఆఫీసులుపై కూడా సోదాలు జరుగుతున్నాయ్. మొత్తం కథలో నీతి కానీ ఇతరులు నేర్చుకోవాల్సిన అంశం కానీ ఏదైనా ఉందంటే..డబ్బు విపరీతంగా సంపాదించడం తప్పు కాదు..వాటికి లెక్కలు ఉండాలి. చట్టప్రకారం ఇతర పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ఎలాంటి చిక్కులు ఎదురుకావు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.