వాణిజ్య వివాద షాక్‌- మార్కెట్ల పతనం!

తాజాగా చైనాతో వాణిజ్య వివాదాలకు అమెరికా కాలుదువ్వడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు బలహీనపడ్డాయి. దేశీయంగానూ అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ నీరసంగా కదిలి చివరికి నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 356 పాయింట్లు కోల్పోయి 37,165 వద్ద నిలవగా.. నిఫ్టీ 101 పాయింట్లు పతనమై 11,245 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, ఆటో, ఐటీ, బ్యాంక్‌ నిఫ్టీ 1.7-1 శాతం మధ్య క్షీణించగా.. ఫార్మా 1.3 శాతం ఎగసింది. మెటల్‌ సైతం 0.25 శాతం బలపడింది. బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 1345 బలపడితే.. 1323 నీరసించాయి.

దిగ్గజాలు ఇలా

నిఫ్టీ దిగ్గజాలలో కొటక్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంతా, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా 3-2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్, గెయిల్‌, హెచ్‌యూఎల్‌, కోల్‌ ఇండియా 3-1 శాతం మధ్య ఎగశాయి.

రెండు వైపులా అమ్మకాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో బుధవారం రూ. 96 కోట్లు,  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 562 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 572 కోట్లు ఇన్వెస్ట్‌చేయగా..  దేశీ ఫండ్స్‌ రూ. 291 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -