ఇంటి పెరట్లో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలు వెలికితీత..

missing-family-found-buried-kerala-thdopuzha

నాలుగురోజులుగా కనిపించకుండా పోయిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు శవాలుగా వ్యక్తులు మారారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లా తోడోపుజా గ్రామానికి చెందిన కృష్ణన్‌, అతని భార్య, కుమారుడు, కుమార్తె.. వారి ఇంటి పెరట్లోనే మృతదేహాలుగా పడివున్నారు. గ్రామంలో కృష్ణన్‌(56)కు భూత వైద్యుడిగా, జ్యోతిష్యుడిగా పేరుంది. పైగా సమీపగ్రామాల్లో పూజలు కూడా చేసేవారు. అయితే నాలుగు రోజులుగా వీరు కనిపించడంలేదు. పైగా ఇంట్లో రక్తపు మరకలు ఉండటంతో ఆందోళన చెందిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.

missing-family-found-buried-kerala-thdopuzha

వివిధ కోణాల్లో దర్యాప్తు సాగించిన పోలీసులు జాగిలాల సహాయంతో ఇంటి వెనకాల ఉన్న పెరట్లో వీరి మృతదేహాలను వెలికితీశారు. గుర్తుతెలియని వ్యక్తులు వీరిని దారుణంగా హత్య చేసి పెరట్లో పూడ్చిపెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కృష్ణన్‌ కుటుంబానికి చేతబడి చేసి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు బంధువులు. ఈ కోణంలో కూడా కేసు దర్యాప్తు జరుగుతోంది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కొట్టాయం మెడికల్‌ కాలేజీకి తరలించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -