త్వరలో మరో ‘బాహుబలి’

now-a-prequel-to-baahubali-on-netflix

భారతీయ సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి.. భారతీయ సినిమా రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసేసింది.ఈ సినిమాతో విశ్వవ్యాప్తంగా తెలుగు సినిమా జండాను రెపరెపలాడించాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ఇదే కోవలో మ‌రో ‘బాహుబ‌లి’ రాబోతోంది. అయితే ఇది సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్‌. ఈ మేరకు వెబ్ సిరీస్ ప్లాన్ చేసింది నెట్ ఫ్లిక్స్.క్స్.

now-a-prequel-to-baahubali-on-netflix

అయితే ఇందులో కేవలం శివగామి జీవితాన్ని, మాహిష్మతి రాజ్యాన్ని మాత్రమే ఆవిష్కరించబోతున్నారు. ప్రముఖ రైటర్ ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘రైజ్ అఫ్ శివగామి’ బుక్ ఆధారంగా ఈ ఫ్రీక్వెల్ తెరకెక్కుతుంది. బాహుబలిని నిర్మించిన రాజమౌళి నిర్మాతలుగా వ్యవహరించిన ఆర్కామీడియా కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. ఈ సిరీస్ కు దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. మొదటి సీజన్ లో తొమ్మిది ఎపిసోడ్ లు ఉంటాయి. ఇందులో శివగామి చిన్నప్పటి జీవితం ఆమె ధైర్యసాహసాలు వంటి ఘటనలు ఉంటాయి.

కాగా ఈ ఫ్రీక్వెల్ కు సంబంధించి బాహుబలి దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. నెట్ ఫ్లిక్స్ నిర్ణయం భారతీయ ప్రాచీన కథను ప్రపంచానికి చాటిచెబుతోందని.ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిత్ర నిర్మాత ప్రసాద్ దేవినేని, మాట్లాడుతూ.. ఈ ఫ్రీక్వెల్ ఒరిజినల్ సిరీస్ డెవలప్ చెయ్యడానికి ఏడాదికి పైగా నెట్ ఫ్లిక్స్ తో పనిచేస్తున్నట్టు అయన తెలిపారు. ఇదిలావుంటే సాకార్డ్ గేమ్స్ తరువాత ‘నెట్ ఫ్లిక్స్’ బాహుబలి ఫ్రీక్వెల్ నే నిర్మించడం గమనార్హం.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -