అలా చేయడం తప్పే..ఆ విషయంలోనా కూతురు సైతం ప్రశ్నిస్తోంది

shirt-off-at-Lords-says-Sourav-Ganguly

ఇప్పటివరకు భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన నాయకులలో సౌరబ్ గంగూలి రూటే సెపరేట్. అతని కెప్టెన్సీ ప్రస్థానంలో ఎన్నో మెరుపులు మరెన్నో మరకలు. నాట్ వెస్ట్ సిరీస్ విజయం సాధించిన తర్వాత లార్డ్స్ మైదానంలో గంగూలీ షర్టు విప్పి గింగిరాలు తిప్పిన ఘటన క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. ఆనాటి సంఘటన గురించి గంగూలి తాజాగా స్పందించారు. “ఆరోజు అలా చేయడం తప్పే. ఇంగ్లాడ్ బౌలర్ ప్లింటాప్ షర్ట్ విప్సి భారత్ జట్టును అవహేళన చేయడం వలనే నేనూ అలాచేయాల్సివచ్చింది. షర్టు విప్పే ప్రయత్నంలో ఉన్నపుడు లక్ష్మణ్, హర్భజన్ సింగ్ వారించినా నేను వినిపించుకోలేదు. ఈ విషయంలో నా కూతురు సైతం ప్రశ్నిస్తోంది.. చొక్కా విప్పాల్సిన అవసరముందా అని అడుగుతోంది .ఐతే కొన్నిసార్లు మన చేతుల్లో ఏమీ ఉండదని పరిస్థితులు మనల్ని ఆ విధంగా ప్రేరేపిస్తాయని” గంగూలీ వ్యాఖ్యానించాడు.