మహిళా ఎమ్మెల్యే వ‌చ్చార‌ని గుడిని శుద్ధి చేశారు..

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయాన్ని మహిళా ఎమ్మేల్యే సందర్శించారు. ఆ కారణంగా గుడిని గంగ నీటితో శుభ్రం చేశాడు పూజారి. ఈ సంఘటన యుపీలో రాజకీయంగా దుమారం రేపుతుంది. ముష్కర్ గ్రామంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గోనేందుకు ఎమ్మెల్యే మనిషా అనురాగి ఆ గ్రామానికి వచ్చారు. ఆ కార్యక్రమానికి ముందు ఆమె గ్రామంలోని రిషి ద్రూమ్ ఆలయాన్ని సందర్శించారు.అయితే ఆ గుడిలోకి మహిళలకు ప్రవేశం లేదు.ఏమ్మేల్యే మహిళ అయినందున ఆమె దర్శించుకొని వెళ్ళిన తరువాత ఆలయ పూజారి గుడిని శుభ్రం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మేల్యే మనిషా అనురాగి ఇది మ‌హిళ ప‌ట్ల జరిగిన అవ‌మానం అని ఆవేదన వ్యక్తం చేశారు.