దర్శకుడు రాజమౌళి తల్లి పేరుమీద స్కూల్ నిర్మాణం

tollywood-director-rajamouli-school-donation-new-building

దర్శకుడు రాజమౌళి సామాజిక సేవలోనూ ముందు ఉంటున్నారు. విశాఖ జిల్లా కశింకోటలో తన తల్లి పేరుమీద.. సొంత నిధులతో స్కూల్‌ భవనాన్నిప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాజమౌళి సతిమణి రమా రాజమౌళి కూడా పాల్గొన్నారు. హుద్‌హుద్‌ తుఫానులో జరిగిన నష్టానికి స్పందించిన రాజమౌళి ఇలా తన ఉదారతను చాటుకున్నారు.

tollywood-director-rajamouli-school-donation-new-building

కశిం కోటలో ప్రభుత్వ పాఠశాల హుద్‌హుద్‌ తుఫాను తీవ్రతకు పురాతన భవనం నేలమట్టమైంది. దానిపై మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన రాజమౌళి 40 లక్షలు సొంత నిధులు ఖర్చుపెట్టి.. తన తల్లి జనని పేరు మీద స్కూల్‌ బిల్డింగ్‌ను నిర్మించారు.

విద్యార్థులు చదువులతో పాటు, ఆటల్లోనూ చురుకుగా ఉండాలని రాజమౌళి పిలుపిచ్చారు. తన తల్లి ఎప్పుడూ చదువు కోసం ఒత్తిడి చేయాలదన్నారు.. ఎక్కువగా ఆడుకోమనే చెప్పేవారని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిలా గోవింద్‌, ఆర్డీవో సూర్యకళ, ఎమ్మార్వో జ్ఞానవేణి స్కూల్‌ సిబ్బంది పాల్గొన్నారు..