‘చి.ల.సౌ.’ మూవీ రివ్యూ

chi-la-sow-telugu-movie-review

నటీనటులు : సుశాంత్ , రుహాణి శర్మ , వెన్నెల కిశోర్
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు : నాగార్జున అక్కినేని , జశ్వంత్ నడిపల్లి
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫర్ : సుకుమార్. ఎం
ఎడిటర్ : చోటా కె ప్రసాద్

ఫార్ములా కథలకు బ్రేక్ ఇచ్చి ఒక సింపుల్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుశాంత్. ప్రీరిలీజ్ టాక్ తోనే హిట్ సినిమా అనే ఫీలింగ్ ని కలిగించిన చిలాసౌ ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లను అందించిందో తెలుసుకుందాం.

కథ:
పెళ్ళికి ఇంకా ఐదేళ్ళు టైం కావాలని కోరుకునే అర్జున్ ( సుశాంత్ ) పేరెంట్స్ బలవంతపై అంజలి(రుహాణిశర్మ) ని కలుస్తాడు. పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పేస్తాను. కానీ అంజలి తో కాసేపు మాట్లాడాక తన పై ఇష్టం కలుగుుతంది. అంజలి కి పెళ్ళి ఇష్టం కాదు, అవసరం. తల్లి ఆరోగ్యం పాడవతుందనే భయంతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. అంజలి కి నో చెప్పాక, మళ్ళీ యస్ అనిపించుకోవడానికి మద్య జరిగే ఒక రోజు ప్రయాణమే ఈ కథ.

కథనం:
యూత్ కి బాగా రిలేట్ అయ్యే పాయింట్ ని తీసుకోని ప్లజంట్ గా ఒక ప్రేమకథ చెప్పడంలో రాహుల్ సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా తొలి ప్రయత్నమే అయినా లిమిటెడ్ క్యారెక్టర్స్ అండ్ సిట్యువేషన్స్ ఉన్న కథను తెరకెక్కించడంలో అతను అనుభవం ఉన్న దర్శకుల కంటే మెరుగ్గా అనిపించాడు. పదినిముషాల తర్వాత హీరో ప్రాబ్లమ్ ఏంటో అర్దం అవుతుంది. ఆ సమస్యను కన్ ఫ్యూజన్ గా ఆలోచించే హీరోకు, ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉండే అమ్మాయి పెళ్లి చూపులలో పరిచయం అవుతుంది. ఒంటరిగా ఉన్న హీరో ఇంటికి హీరోయిన్ ఒంటరిగా పెళ్లి చూపుల కోసం రావడం అనే ఆలోచన చాలా ప్రెష్ గా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ ని పరిచయం అయి అలవాటు అవడం మొదలయ్యాక ఆ అమ్మాయి లుక్స్ ని పెద్దగా పట్టించుకోనంత అందమైన క్యారెక్టర్ ని డిజైన్ చేసాడు రాహుల్. అరేంజిడ్ మ్యారేజ్ సిస్టమ్ లో అమ్మాయిలు కోల్పోయే ఆత్మగౌరవాన్ని ప్రతి బింబించే మాటలు ఆలోచనలు లో మార్పులు తెస్తాయి. పెద్ద హాడావుడి లేకుండా పెళ్ళి చూపుల తంతు ముగిస్తే బాగుంటదనే ఫీలింగ్ చూస్తున్న ఆడియన్స్ కి ఒక్కసారైనా కలుగుతుంది. రుహాణి అందం కంటే ఆ పాత్ర వ్యక్తిత్వం తెచ్చే అందాన్ని చూపెట్టడంలో సక్సెస్ అయ్యింది. ఒక అమ్మాయి నచ్చడం, వెళ్ళి పోతుంటే వెలితిగా ఫీల్ అవ్వడం.. ఏంటి లవ్వా అంటే తెలియదు అని కన్ ఫ్యూజ్ అవ్వడం ఇలాంటి లక్షణాలున్న పాత్రలో సుశాంత్ మెప్పించాడు. ఇష్టమే కానీ ప్రేమో కాదో తెలియదు ఇంకా కొంచెం టైం కావాలి అనే ఫీలింగ్స్ ఉండే యూత్ కి మిర్రర్ ఇమేజ్ లా ఉండే పాత్రలో ఇట్టే దూరిపోయాడు. సినిమాలో పెద్దగా క్యాస్టూమ్స్ ఉండవు.. హీరో షాట్స్ మీదుంటే, హీరోయిన్ సల్వార్ లో కనిపిస్తుంది. అయినా వీరిప్రేమకథ చాలా అందంగా కనిపించింది. కారణం ఆ ప్రేమకథలో కనిపించే నిజాయితీ. వెన్నెల కిషోర్ ఈ కథలో కనిపించిన ప్రతి సారి నవ్వించాడు. రోహిణి పాత్రతో తల్లిప్రేమను, రుహాణి పాత్రతో తల్లి దండ్రుల మీద పిల్లలకుండే బాధ్యతను చాలా బాగా చూపెట్టాడు దర్శకుడు. తనకున్నంతలో ఎవరి సాయం లేకుండా ఆత్మగౌరవంతో బతకాలనుకునే అంజలి పాత్రతో ప్రతి ప్రేక్షకుడు ప్రేమలో పడతాడు. అందుకు హీరో ముందు కాదని తర్వాత ఆమె వెంట పడుతున్నా నిజమే కదా, ఇంత మంచి అమ్మాయిని వదులుకోకూడదు అనిపిస్తుంది. సుశాంత్ తన కెరియర్ లో మరో చాప్టర్ మొదలు పెట్టాడనిపించింది. రాహుల్ దర్శకుడుగా కొత్త చాప్టర్ ఒపెన్ చేసాడు.

చివరిగా:
సరదాగా సాగే ఈ ప్రేమకథ సమయం తెలియనివ్వదు.

– కుమార్ శ్రీరామనేని