మీ సేవలు ఇక చాలు.. ‘కాగ్నిజెంట్’లో సీనియర్లకు బైబై..

జూనియర్లకు స్థానం కల్పించే నిమిత్తంగా సీనియర్లపై వేటు వేయాలని చూస్తోంది ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీ కాగ్నిజెంట్. కంపెనీ టార్గెట్ ఫలితాలకు రీచ్ కాలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంగా ఉన్న కాగ్నిజెంట్‌లో ఈ రెండో క్వార్టర్‌లో అట్రిక్షన్ రేటు 22 శాతానికి పైగా ఉందని వెల్లడైంది. గత ఏడాది 4వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. మరో 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్‌ను వారి ముందుంచింది.

ఇది గ్లోబల్ ప్రక్రియలో ఒక భాగం మాత్రమే అని కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజ్ మెహతా ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే రెండో క్వార్టర్‌లో 7500 మంది జూనియర్ ఉద్యోగులను తీసుకుని వారి సంఖ్యను 2,68,900కు చేర్చుకుంది. పనిలో నైపుణ్యతను బట్టి వారికి ప్రమోషన్లు, జీతాల పెంపు చేపట్టనున్నామని కాగ్నిజెంట్ సీఎఫ్‌ఓ కరెన్ మెక్లగ్లిన్ తెలిపారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -