మాది సుదీర్ఘ ప్రయాణం..కానీ…

goldie-behl-responds-on-sonali-health
భర్తతో సోనాలి

ప్రముఖ సినీ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వార్త అభిమానులను తీవ్ర ఆందోళ‌నకు గురిచేసింది. తన సహజ నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సోనాలికి ఇలా అవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా ఆమె ఆరోగ్య పరిస్దితిపై భ‌ర్త గోల్డీ బెల్ స్పందించారు.”ఈ పరిస్ధితులలో సోనాలిపై మీరు చూపిస్తున్న ప్రేమ‌, స‌పోర్ట్‌కి కృతజ్ఞతలు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.ఎలాంటి ఆటంకాలు లేకుండా సోనాలికి చికిత్స కొనసాగుతోంది. ఇది సుదీర్ఘ ప్రయాణం కానీ మేము ఈ ప్రయాణాన్నిసానుకూల దృక్పథంతో ప్రారంభించాము” అంటూ ట్వీట్ చేశారు. . 90ల్లో టాప్ హీరోయిన్ గా సోనాలి వెలుగొందింది. అందం, అభిన‌యం,నటనతో అభిమానులను ఆక‌ట్టుకుంది. మ‌న్మ‌ధుడు, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్, మురారి, ఖ‌డ్గం, ఇంద్ర‌, ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు వంటి తెలుగు చిత్రాల‌లో సోనాలి న‌టించిన సంగ‌తి తెలిసిందే.