‘గూఢచారి’ రివ్యూ

gudachari-movie-review

నటీనటులు : అడవి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్
దర్శకత్వం : శశికిరణ్ టిక్క
నిర్మాతలు : అభిషేక్ నమ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్ : శనీల్ డియో
రచన, స్క్రీన్ ప్లే : అడవి శేష్, శశి కిరణ్ టిక్క, రాహుల్ పాకాల
ఎడిటర్ : గారి బి.హెచ్

ఆర్టిస్ట్ గా నెగిటివ్ రోల్స్ తో ఆడియన్స్ కి దగ్గరయిన అడివిశేషు, క్షణం, అమీ తుమీ లతో హీరోగా మరింత దగ్గరయ్యాడు. ‘గూఢచారి’  ట్రైలర్ అండ్ టీజర్స్ తో ఇండస్ట్రీ తో పాటు ఆడియన్స్ ని అటెన్షన్ ని కూడా రాబట్టగలిగాడు. సీరియస్ సై స్టోరీస్ తెరమీదకు వచ్చి దశాబ్దాలు దాటుతున్న టైం లో వచ్చిన ఈ గూఢాచారి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లను అందించాడో తెలుసుకుందాం..

కథ :
అర్జున్ ( అడివిశేషు) ఇండియన్ సర్వీసస్ లో పనిచేయాలన్నది అతని లక్ష్యం. పట్టు వదలకుండా ట్రై చేసిన ‘రా’ లో జాయిన్ అవుతాడు. ట్రైనింగ్ లో ఉండగా సమీరా పరిచయం అవుతుంది. తన ఐడెంటిటీని సమీరా(శోభిన దూళిపాళ్ళ) తో చెబుతాడు. అర్జున్ ట్రైనింగ్ పూర్తయిన వెంటనే త్రినేత్ర టీం లో మెంబర్ అవుతాడు. ఇండియాలో జరిగే ఉగ్రవాద దాడులను అరికట్టే ఈ టీం లో ఒక చీఫ్ ఆఫీసర్ తో పాటు త్రినేత్ర ను మొదలుపెట్టిన ఆఫీసర్ కూడా ఒక ఎటాక్ లో చనిపోతారు. ఆ ఎటాక్ కి కారణం అర్జున్ అని ఆధారాలు దొరుకుతాయి. అర్జున్ ని చంపాలనే ప్రయత్నంలో ఉగ్రావాదులు సమీర చంపేస్తారు. అసలు అర్జున్ ఎవరు..? అతని పేరు అర్జునేనా..? ఒక ఉగ్రావాద సంస్థ అర్జున్ ని ఎందుకు వెంటాడుతుంది..? అనేది మిగిలిన కథ..?

కథనం:
గూఢాచారిని ఎవరూ అంచనా వేయలేపోవడమే అతని ప్రతిభకు కొలమానంగా మారుతుంది. అలాంటి గూఢాచారిని పరిచయం చేసాడు అడివిశేషు. సినిమా మొదలయిన దగ్గరనుండి ప్రతి టర్న్ కూడా ప్రేక్షకుల అంచనాలకు అందకుండా కథను రాసుకున్నాడు. కథలోకి ఎంటరయిన ఏ పాత్ర మీద కూడా ఖచ్ఛితమైన అభిప్రాయం కలుగు కుండా కథను నడిపాడు. ఇదే గూఢాచారిని థ్రిల్లింగ్ మలిచింది. ఇక గోపీగా అడివిశేషు మారిపోయాడు.తన గత సినిమాల ఛాయలు నటనలో కపడకుండా తనను తానుకొత్తగా ప్రజెంట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. గుఢాచారి కి ప్రధాన బలం దేశం మీద ప్రేమ అయితే బలహీనత కుటుంబం మీద ప్రేమ ఈ రెండిటి మద్య ఎక్కడా బాలెన్స్ తప్పకుండా కథను తీసుకెళ్ళాడు. అడివిశేషు పాత్రలోని పెయిన్ అతని కళ్ళలో ఎప్పుడూ కనపిస్తూనే ఉంది. ఒక ప్రేమకథ లోని ఫీల్ ని తక్కువ సీన్స్ లో ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో దర్శకుడు శశికిరణ్ సక్సెస్ అయ్యాడు. శోభిత లుక్ ఆకట్టుకుంది. అలాగే తన పై పడిన నిందను తొలిగించుకునేందుకు అతను చేసిన ప్రయాణంలో ప్రతి మలుపు ఆసక్తికరంగా ఉంటుంది. టెక్నాలిజీ ని బ్రిలియెన్స్ ని సమపాళ్ళలో వాడి యాక్షన్ సన్నివేశాలను రక్తి కట్టించాడు. బంగ్లాదేశ్ లోని యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. మధుశాలిని పాత్ర కూడా ఉన్నంతలో ఆసక్తికరంగా ఉంది. ఈ థ్రిల్లర్ లో ఎక్కువగా సర్ ప్రైజ్ చేసింది సుప్రియ నటన. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెరమీద కనిపించిన ఈ అక్కినేని వారసురాలు ఒక ‘రా’ సీనియర్ ఎంజెంట్ పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. కళ్ళలో కనిపంచే తీవ్రత, స్క్రీన్ ప్రజెన్స్ పాత్రకు ప్రాణం పోసాయి. శ్రీచరణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, శనీల్ డియో సినిమాటోగ్రఫీ గూఢాచారి కి ప్రధాన బలంగా మారాయి. ప్రకాష్ రాజ్ నటన బాగుంది. మళ్ళీ ప్రకాష్ రాజు విజృభిస్తున్నాడానిపిస్తుంది. అడివిశేషు బాడీ లాంగ్వేజ్ , యాక్షన్ సన్నివేశాల్లో అతను చూపించిన రియలిస్టిక్ ఫెర్ఫార్మెన్స్ అతన్ని పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా మలిచాయి. గూఢాచారి కథలకుండే లక్షణాలు ఎక్కడా మిస్ అవ్వకుండా, యాక్షన్ సన్నివేశాల్లో రోప్ ల సాయం ఎక్కువుగా తీసుకోకుండా మలిచిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లు గూఢాచారికి అదనపు బలంగా మారారు. హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన గూఢాచారి తెలుగు ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించాడు. గరుడ వేగ, గూఢాచారి తెలుగు తెరపై యాక్షన్ కథలకు కొత్త లుక్ ని తెస్తున్నాయి.

చివరిగా:
థ్రిల్లింగ్ హిట్

– కుమార్ శ్రీరామనేని