కోహ్లీపై ప్రశంసల జల్లు

india-vs-england-live-cricket-score-day-2-at-edgbaston-virat-kohli-co-look-to-consolidate-strong-position

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో అద్భుత శతకం సాధించిన భారత కెప్టెన్ విరాట్‌కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బౌలింగ్‌కు అనుకూలిస్తోన్న పిచ్‌పై సహచర బ్యాట్స్‌మెన్ వెనుదిరిగినా… పట్టుదలగా ఆడిన కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్‌ 13 పరుగుల ఆధిక్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఇబ్బందిపెట్టినా.. ఒత్తిడికి లోనుకాకుండా కోహ్లీ ఆడిన తీరును విమర్శకులు సైతం అభినందిస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకూ భారత కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించారు. మాజీ క్రికెటర్లు సచిన్ , హర్భజన్‌, సురేశ్ రైనా, వివిఎస్ లక్ష్మణ్‌తో పాటు విదేశీ మాజీలు సైతం కోహ్లీ ఇన్నింగ్స్‌కు ఫిధా అయిపోయారు. అతన్ని అభినందిస్తూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు పెట్టారు.

కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ ఎంతో ముఖ్యమైనది. శతకం సాధించినందుకు అభినందనలు: సచిన్‌ తెందుల్కర్‌

వాట్‌ ఏ ఛాంపియన్‌ 100? నాయకుడు ముందుండి జట్టును నడిపించాడు. ఇలాంటి నాయకుడు అవసరం. నిజంగా అద్భుత ఇన్నింగ్స్‌ కోహ్లీ. వెల్‌డన్‌ ఇషాంత్‌, ఉమేశ్‌ యాదవ్‌: హర్భజన్‌ సింగ్‌

ప్రపంచంలోనే బెస్ట్‌ స్ట్రోక్ ప్లేయర్‌ కోహ్లీ. కానీ, ఈ శతకంలో కోహ్లీ స్ట్రోక్స్‌ లేవు. 40 బంతులును వదిలేశాడు. అందులో 26 అండర్స్‌వే: సంజయ్‌ మంజ్రేకర్‌

ఇన్‌క్రెడిబుల్‌ ఇన్నింగ్స్‌ కోహ్లీ. బంతిపై ఒక్కడే యుద్ధం చేశాడు: మైకెల్‌ వాన్‌

అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ కోహ్లీ తానేంటో నిరూపించుకుంటూనే ఉన్నారు. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లతో నిలబడి శతకం సాధించడం అంత సులువు కాదు. ఎంతో ఓర్పు, పట్టుదల కావాలి: ఆర్పీ సింగ్‌

విరాట్‌ కోహ్లీ గ్రేట్‌ బ్యాట్స్‌మెన్‌. అలాగే నిజమైన నాయకుడు. ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌ స్కోరుకు దగ్గరగా తీసుకెళ్లాడు: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

కోహ్లీ నుంచి మరో గొప్ప ఇన్నింగ్స్‌. ముందుండి జట్టును కాపాడాడు. అతని పట్టుదల అలాంటిది: వీవీఎస్‌ లక్ష్మణ్‌

టెస్టు సిరీస్‌కు గొప్ప ఆరంభం దక్కింది. సెన్సెషనల్‌ బ్యాటింగ్‌ కోహ్లీ: సురేశ్‌ రైనా