ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ బిజీ బిజీ

కేఆసిర్

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌.. భేటీలతో బిజీ అయ్యారు. ఇప్పటికే కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కలిసి విభజన హామీలపై చర్చించారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 12.25 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. సీఎం వెంట సీఎస్‌ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఎంపీలు వినోద్‌, సంతోష్‌ కుమార్‌లు వెళ్లారు.

ముందుగా కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తో భేటీ అయ్యారు. ముఖ్యంగా హైకోర్టు విభజన అంశంపై వీరిద్దిరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దాంతో పాటు భూ సేకరణ చట్టం 2013 సవరణపై చర్చించినట్టు తెలుస్తోంది.

మరికొంతమంది కేంద్రమంత్రులను కూడా సీఎం కేసీఆర్‌ కలవనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్‌ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించేవరకు సీఎం రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. అవసరమైతే ప్రధానమంత్రి మోడీని కలిసి కొత్త జోనల్‌ అవసరాన్ని వివరించనున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -