శాంసంగ్‌ ‘ఇండిపెండెన్స్‌ డే’ సందర్బంగా అదిరే ఆఫర్స్..

samsung-announces-independence-day-sale

గాడ్జెట్స్ దిగ్గజం శాంసంగ్‌ మరోసారి సూపర్ ఆఫర్లకు తెరతీయబోతుంది. ఇండిపెండెన్స్‌ డే సందర్బంగా ఫోన్ల కొనుగోలుపై స్పెషల్‌ ఆఫర్లు అందిస్తున్నట్టు పేర్కొంది. అలాగే శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌ కింద టీవీలు, అప్లియెన్స్‌, వేరబుల్స్‌, ఆడియో యాక్ససరీస్‌పై కూడా డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఆగస్టు 1 నుంచి మొదలైన ఈ సేల్‌ ఆగస్టు 5 వరకు కొనసాగుతుందని తెలిపింది.

samsung-announces-independence-day-sale

కాగా శాంసంగ్ ప్రకటించిన ఆఫర్లు ఇలా ఉన్నాయి.. గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ విలువ రూ. 4 వేలు తగ్గించి రూ.64,990కు అందుబాటులో ఉంచింది. అంతేకాదు ఈ ఫోన్ కొన్నవారికి రూ.3000 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. శాంసంగ్‌ ఇండిపెండెన్స్‌ డే సేల్‌లో గెలాక్సీ ఎస్‌9 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.57,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 128జీబీ, 256జీబీ వేరియంట్‌పై రూ.6000 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌, 64జీబీ మోడల్‌పై రూ.5000 క్యాష్‌బ్యాక్‌ ఇస్తూ.. అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులపై రూ.6000 క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. అయితే పేటీఎం నుంచి కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు శాంసంగ్ తెలిపింది.