ఉత్తర కొరియా ఉత్తరాన్నిఅందుకున్న ట్రంప్

us-northkorea-usa-trump-trump-received-letter-from-north-koreas-kim-on-august-1-white-house

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఉత్తరకొరియా నియంత నుంచి వచ్చిన ఉత్తరాన్ని అధ్యక్షుడు ట్రంప్ అందుకున్నారని అమెరికా అధ్యక్షభవనం వైట్ హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరుదేశాధినేతల మధ్య సింగపూర్ లో జరిగిన చర్చల అనంతరం వచ్చి మొదటి ఉత్తరమని తెలిపింది. ఇందుకు ట్రంప్ కిమ్ కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించింది. అయితే ఆ ఉత్తరంలో ఏమి ఉందో మాత్రం వెల్లడించలేదు. కొరియా వార్ లో కనిపించకుండా పోయిన అమెరికా సైనికుల అవశేషాలను కొరియా గతవారం అమెరికాకు అందించింది. ఈనేపధ్యంలో ట్రంప్ కిమ్ కు ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.