పాపం.. పసివారు.. !

why-children-has-been-often, targeted, physical-abuse

ప్రతీరోజూ ఏదో ఒకచోట అత్యాచారాలు సాధారణమైపోయిన పరిస్థితి. అయినా.. నిర్భయ, అభయ, కథువా, ఉన్నావ్ లాంటి ఘటనలు.. “మనం ఎటు పోతున్నాం?” అని ప్రశ్నించుకునేలా చేస్తాయి. మొన్నామధ్య యాదాద్రిలో 11 ఏళ్లు నిండిన బాలికలకు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి, వారిని రకరకాలుగా ‘వాడుకునేందుకు’ పన్నిన పన్నాగం కానీ, బీహార్‌లోని ముజఫర్‌పూర్ లో ఒక shelter home లో ఉన్న 21 మంది అమ్మాయిలను రేప్ చేయడం కానీ విన్నప్పుడు ఈ సమాజం ఇక ఇంతేనా? అనే నిర్వేదం ఆవహిస్తుంది. ఎంతో ‘కఠినం’ అని మన పాలకులు Feel అవుతున్న చట్టాలు ఇలాంటి నిక‌ృష్ట చర్యల్ని ఎందుకు ఆపలేకపోతున్నాయి? రోజురోజుకీ ఈ విచ్చలవిడితనం పెరగడానికి కారణం ఏంటి? ప్రభుత్వాలు కొట్టిపడేసినా, ప్రపంచంలోనే మహిళలకు అత్యంత ప్రమాదకర దేశాల్లో భారత్ నెం.1 అని Reuters foundation survey తేల్చడమేంటి? మనిషి mars ని చేరాలని కలలు కంటున్నందుకు, ప్రయత్నిస్తున్నందుకు సంతోషించాలో, లేక మనిషిగా దిగజారిపోతున్నందుకు బాధపడాలో అర్ధం కాని situation. రానురాను “ఆడపిల్ల పుట్టకూడదు దేవుడా” అని యువతరం వేడుకుంటుందేమో! ఆ మాటకొస్తే, ఈ సమస్య కేవలం ఆడపిల్లలకే పరిమితం కాదు, ముఖ్యంగా బాలబాలికలపై అకృత్యాలు సమాన స్థాయిలో జరుగుతున్నాయని నివేదకలు వెల్లడిస్తున్నాయి.

పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల్లో సుమారు 54% మగ పిల్లలపై జరుగుతున్నవే అని గణంకాలు చెబుతున్నాయి. వీటిల్లోనే 94% తెలిసిన వారే.. పిల్లలతో బాగా పరిచయమున్నవారే చిన్నారులను కాటేస్తున్నారనేది వాస్తవం. వారికి భయపడి కానీ, సామాజిక పరిస్థితుల వల్ల కానీ, చాలా విషయాలు మరుగునపడి పోతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన teachers తమ school లోని 6, 7, 8, 9, 10 తరగతుల ‘మగ’ విద్యార్థులను లైంగికంగా హింసించిన ఘటన ఇటీవలే Hyderabad రాంనగర్ లో వెలుగుచూసింది. చూడగానే ముద్దొచ్చే పాలబుగ్గల పసివారిపై ఇలాంటి పైశాచికత్వం చూపించే వారిని ‘పశువులు’ అందామా అంటే, పాపం ఆ జాతి కూడా సిగ్గుపడుతుందేమో! ఎందుకంటే, కామాంధులు కొందరు హర్యానాలో ఒక మేకపై లైంగిక దాడి చేసిన దారుణ పరిస్థితి!

ఎందుకు, ఏ కారణాలు చేత మనిషి ఇంతటి అవాంఛనీయ ప్రవర్తనవైపు వెళుతున్నట్లు? చట్టాలు కఠినంగా అమలు చేయడం, దారుణ శిక్షలు విధించడం వంటివన్నీ మనం ఎప్పుడూ వినేవే! అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో, ఆ పైవాడికి కూడా ఐడియా ఉండే అవకాశం లేదు! అయితే, ఎంతసేపూ ఇది జరగట్లేదు, అది జరగట్లేదు అని నిందించడం తప్ప మనం ప్రతీ ఒక్కరం మన స్థాయిలో ఏమీ చేయలేమా? ఇదంతే! అనే నిరాశా నిస్పృహలతో జీవించేయాలా? paper లోనో, tv ల్లోనో ఇలాంటి ఘటనలు విన్నా, చూసినా అప్పటికప్పుడు రక్తం మరిగించి, ఆ తర్వాత మన దైనందిక జీవితంలో మనం పడిపోవడమేనా? ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే ఆలోచనా విధానాన్ని మార్చుకోలేమా? ఎందుకు మార్చలేం? కచ్చితంగా మార్చగలం!

మనం తల్చుకుంటే, చేయలేనిది ఏదీ లేదు. మార్పు కోసం ఎదురు చూడకుండా మనతోనే మార్పు మొదలుపెడదాం. మన పిల్లలకు ర్యాంక్ ల విద్యావిధానం కన్నా, విలువల విద్యావిధానాన్ని ఇద్దాం. పిల్లలతో కొంత సమయం (Productive) గడుపుదాం. వారికి మంచీ – చెడూ విడమర్చి చెబుదాం. అన్నింటికన్నా ముఖ్యంగా, వారికి సంబంధించిన ఏ విషయమైనా మనతో మనసు విప్పి చెప్పుకునే స్వేచ్ఛనిద్దాం. ఇలా చేస్తే, దారుణాలు ఆగిపోతాయా అంటే, కచ్చితంగా కాదు! కానీ , మన ఇంట్లోంచి ఒక rapist కానీ, ఒక victim కానీ సమాజంలోకి చేరకుండా అడ్డుకోగలం! వీటితోపాటు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మరింత వేగిరమయ్యేలా ఒత్తిడి చేయడం కూడా పౌరసమాజం బాధ్యతే! అంతేకాకుండా, సరైన వయసులో (సిగ్గుపడకుండా) పిల్లలకు sex education ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. వ్యవస్థకు, సమాజానికి పట్టిన చీడను వదిలించేందుకు మనవంతు ప్రయత్నం చేద్దాం.

“Rome Was not built in a day” అన్నట్టు.. ఏ గొప్ప పనీ ఒక్క రాత్రిలో జరిగిపోదు. సహనంతో, సహృదయంతో ఒక Positive attitude తో పనిచేసి, మనలోని మానవత్వం పూర్తిగా అంతరించిపోలేదని, మనిషిగా చచ్చిపోలేదని చాటిచెబుదాం.

– సౌజన్య

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.