ప్రియుడితో అసభ్యంగా దొరికిన మహిళ.. ఆపై..

wife-bite-husband-genitals-save-lover-vellore

ఊళ్ళో అందరూ జాతరలో పాల్గొన్నారు. సెంథామరై.. తన భార్యతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. కొంత సేపటికి అతని భార్య తప్పిపోయింది.. తీరా చూస్తే ఆమె తన ప్రియుడు వద్ద ప్రత్యక్షమైంది.

తమిళనాడు వెల్లూరులోని గుడియాతం మండలం తురైమూలై గ్రామంలో జాతర జరుగుతోంది. దీంతో గ్రామానికి చెందిన రైతు సెంథామరై తన భార్య జయంతితో కలిసి పాల్గొన్నాడు. జాతర కావడంతో ఊరంతా హడావుడిగా ఉంది. ఇంతలో గుంపులో ఉన్న సెంథామరై భార్య తప్పిపోయింది. భార్య తప్పిపోయి ఏ అవస్థలు పడుతుందో అని టెన్షన్ పడుతూ ఆమెకోసమే వెతుకులాట ప్రారంభించాడు. ఇంతలో ఆమె తన ప్రియుడితో కలిసి పాడు పడ్డ గోడచాటున అసభ్యంగా కనిపించింది. దీంతో సెంథామరై వారిద్దరిని నిలదీశాడు. ఈ క్రమంలో వారి మధ్య పెనుగులాట జరిగి.. సెంథామరై పంచె ఊడిపోయింది. అయినా కూడా అతన్ని పట్టుకుని గ్రామస్థుల చేత నిలదీయించాలనే క్రమంలో కేకలు వేశాడు. కానీ జాతరలో జనం కోలాహలం మధ్య అతని అరుపులు వినిపించలేదు. తన ప్రియుడిని వదిలెయ్యమని జయంతి తన భర్తను పిడిగుద్దులతో దాడి చేసింది. అయితే సెంథామరై ఇంతకీ ఆ వ్యక్తిని వదలకపోవడంతో ఆమె.. భర్తపై పడి మర్మాంగాన్ని కొరికింది. ఆపై ప్రియుడితో సహా అక్కడి నుంచి జారుకుంది. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు రక్తపు మడుగులో పడి ఉన్న సెంథామరైను గమనించి వేలూరు రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.