గేదె తోక పట్టుకుని 65 ఏళ్ల పెద్దాయన.. 17గంటల తర్వాత..

‘కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు’ అనే సామెత గుర్తుందా! 65 ఏళ్ల పెద్దాయన ఈ సామెతను గుర్తుపెట్టకోవటమే కాదు ఏకంగా అమలు చేశాడు కూడా.. కాకపోతే కుక్క తోక బదులు గేదె తోక పట్టుకుని నదిని దాటేందుకు ప్రయత్నించాడు.

మధ్యప్రదేశ్‌లోని గండ్‌రౌలీ గ్రామనికి చెందిన లాలారామ్ శర్మ తన గేదెను తీసుకుని బేస్లీ నదిని దాటుతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా నదీ ప్రవాహ వేగం పెరగడంతో ఆ ఉదృతికి తట్టుకులేని శర్మ గేదె తోకని జారవిడిచాడు. దీంతో అతడు ఆ నదిలో మునిగిపోయాడు.

ఎంతకీ లాలారామ్ శర్మ ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. శర్మ నదిలో మునిగిపోయి ఉండవచ్చని వారికి అనుమానం రావడంతో రెస్క్యూటీమ్‌కు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టిన సహాయక బృందానికి 17 గంటల తరువాత ఆ వృద్ధుని మృతదేహం నదిలో లభ్యమైంది.