కుప్పకూలిన హెలికాప్టర్‌.. 18మంది దుర్మరణం

8-feared-dead-in-russian-chopper-crash/article
Photo for representation purpose only

రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైబిరియాలోని క్రాస్నోయారస్క్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఎంఐ-8 హెలికాప్టర్ ఆయిల్‌ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 18 మంది ప్రాణాలు కోల్సోయారు. హెఃలికాప్టర్ టేకాప్ తీసుకుంటున్న సమయంలో మరో హెలికాప్టర్‌ తగలడంతో కుప్పకూలిపోయిందని తెలిపారు. హెలికాప్టర్‌లో 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారని రష్యా రవాణాశాఖ మంత్రి వెల్లడించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.