కరుణానిధిని పరామర్శించిన చంద్రబాబు

AP cm chandrababu, cm meet dmk chief, karunanidhi

చెన్నైకి వెళ్లిన సీఎం చంద్రబాబు డీఎంకే అధినేత కరుణానిధినిని పరామర్శించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై.. కావేరి ఆస్పత్రిలో కరుణానిధి చికిత్స పొందుతున్నారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై స్టాలిన్, కనిమొళిని అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు.

కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు ప్రముఖులంతా పరామర్శిస్తున్నారు. కరుణానిధి చికిత్స పొందుతున్న ఆసుపత్రి దగ్గర డీఎంకే శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. కలైంజర్‌కు ఏమైందో ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలాగుందో అని ఆవేదన చెందుతున్నాయి. వైద్యులు రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.. చికిత్స కొనసాగుతోంది.