నిరుద్యోగులకు శుభవార్త.. రెట్టింపైన రైల్వే పోస్టులు

good news, railways, job vacancies, asst loco pilots, technicians posts

ఆగస్టు 9న రైల్వే పరీక్ష రాయబోతునన్న అభ్యర్థులకు రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయెల్ ఓ శుభవార్త చెప్పారు. అసిస్టెంట్‌ లోకో పైలట్లు, టెక్నీషియన్ల పోస్టులను 26,502 నుంచి 60 వేలకు పెంచామని ఆయన తెలిపారు. 47.56 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసి ఉన్న ఈ పోస్టులకు సంబంధించిన కంప్యూటరు పరీక్ష ఆగస్టు 9న జరగనుంది.

26,502 లోకోపైలట్లు, టెక్నీషియన్ల పోస్టులకు రైల్వే శాఖ గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ పోస్టుల్లో మరిన్ని ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో పోస్టులను పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అసిస్టెంట్‌ లోకో పైలట్లు, టెక్నీషియన్ల పోస్టులను 26,502 నుంచి 60 వేలకు పెంచామని పీయూష్‌ గోయెల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.