తొలి టెస్టులో భారత్‌ ఓటమి

బర్మింగ్‌హామ్ టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. 194 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. బౌలింగ్‌కు అనుకూలిస్తోన్న పిచ్‌పై పట్టుదలగా ఆడి విజయంపై ఆశలు రేకెత్తించిన కెప్టెన్ విరాట్‌కోహ్లీ నాలుగోరోజు త్వరగానే ఔటయ్యాడు. ఆట ప్రారంభమైన తొలి ఓవర్లనే దినేశ్ కార్తీక్ ఔటవగా… కోహ్లీ, హార్థిక్ పాండ్యా పార్టనర్‌షిప్‌తో భారత్ గెలుస్తుందనిపించింది. వీరిద్దరూ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను కాన్ఫిడెంట్‌గా ఆడారు. ఫామ్‌లో ఉన్న కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ స్టోక్స్ కోహ్లీని ఔట్ చేయడంతో భారత్ ఓటమి ఖాయమైంది. ఇదే ఓవర్లో షమీని కూడా స్టోక్స్ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. చివర్లో పాండ్యా ధాటిగా ఆడినా… జట్టును గెలిపించలేకపోయాడు. భారత బ్యాటింగ్‌లో కోహ్లీ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే… పాండ్యా 31 పరుగులు చేశాడు. ఇంగ్లీష్ బౌలర్లలో స్టోక్స్ 4 వికెట్లు పడగొట్టగా… ఆండర్సన్ 2, బ్రాడ్ 2, కరాన్ , రషీద్ ఒక్కో వికెట్ తీసారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 287 పరుగులు చేయగా… భారత్ 274 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్ 180 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో రెండో టెస్ట్ ఆగష్ట్ 9 నుండి లార్డ్స్‌ వేదికగా జరగనుంది.

  • నరేష్

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.