రైలుకింద పడి వృద్ధురాలు మృతి

కరీంబీ ( పైల్ ఫోటో )

ఢిల్లీలో గద్వాల జిల్లాకు చెందిన వృద్ధురాలు మృతి చెందింది. రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న కరీంబీ(60) అనే వృద్దురాలి మ‌ృతదేహన్ని రైల్వే పోలీసులు గుర్తించారు.మూడు నెలల క్రితం కరీంబీ కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమె మిస్సింగ్‌పై పోలీసుల పిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు కరీంబీ శవాన్ని గద్వాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.