లవర్‌తో రొమాన్స్.. భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన భార్య

wife cheating her husband, lover, Romance husband
ఫైల్ ఫోటో

ప్రియుడి మోజులో పడి అగ్నిసాక్షిగా పెళ్లిచేసుకున్న భర్తకు అన్యాయం చేస్తున్నారు కొందరు మహిళలు. తమ కోరికలు తీర్చుకోవటానికి ఎంతకైనా తెగిస్తున్నారు కిలాడి లేడీలు. ఓ మహిళ ప్రియుడితో రొమాన్స్ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా భర్తకు పట్టుపడిన ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది.

కువైట్‌లో ‘టీమ్‌ వన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నారు గోపిశెట్టి శ్రీధర్‌‌. ఫిలింనగర్‌లోని అపర్ణ సినార్‌వ్యాలీలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసముంటున్నారు. ఆయన భార్య ఇంట్లోనే వ్యాయామం చేసుకునేందుకు బోయిని రాకేష్‌కుమార్‌యాదవ్‌ అనే వ్యక్తిని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా నియమించుకుంది. ప్రతిరోజూ రెండు గంటల పాటు వారి ఇంటికి వచ్చి రాకేష్‌ వ్యాయామం చేయించేవాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

గత రెండు నెలలుగా శ్రీధర్‌ కువైట్‌లో ఉండగా రాకేష్‌ పూర్తిగా ఆయన ఇంట్లోనే ఉంటూ భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన శ్రీధర్‌ వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బయటికి గెంటేశాడు. అయితే అప్పటికే వారిద్దరూ కలిసి ఓ నిర్మాణ రంగ సంస్థను కూడా ప్రారంభించినట్లు ఆయన తెలుసుకున్నాడు.

తన భార్యతో పాటు ఆమె ప్రియుడి నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని శ్రీధర్ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన భార్యతో పాటు రాకేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -