ఎస్వీ యూనివర్సిటీలో చిరుత.. ఆవుదూడపై దాడి.. విద్యార్థుల్లో భయం

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. అటవీప్రాంతానికి సమీపంలో రెండు ఆవుదూడలపై దాడి చేసి చంపేసింది.దీంతో.. విద్యార్థులు, ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో రెండు చిరుతల సంచారాన్ని గమనిస్తున్నామని స్థానికులు చెప్తున్నారు. ఎస్వీ ఆడిటోరియం సమీపంలో గతంలోనూ ఇలా దాడి చేసి జింకల్ని, లేగదూడల్ని చంపిన ఘటనలు ఉన్న నేపథ్యంలో.. అందరూ టెన్షన్ పడుతున్నారు. అటు, ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుతల పాదముద్రల్ని సేకరించారు. జనావాసాల్లోకి చిరుతలు రాకుండా చేసేందుకు ఏం చేయాలన్న దానిపై పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందితో.. వర్సిటీ అధికారులు చర్చిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -