‘వెండి’సింధుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు

cm chandrababunaidu congratulates on pv sindhu

బ్యాడ్మింటన్‌ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లో రజతం కైవశం చేసుకున్న సింధును అభినందించారు సీఎం చంద్రబాబు. ఫైనల్లో స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌ లో ఓడినా అద్భుత ప్రతిభ చూపిందని సింధును ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజతం గెలిచి సింధు భారత షట్లర్ల ఘనతను చాటిందని ప్రశంసించారు.

cm-chandrababunaidu-congratulate-pv-sindhu
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణే కాదు ప్రపంచశ్రేణి క్రీడాకారిణిగా సింధు రాణించడం గర్వకారణమని అన్నారు.ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లో అద్భుత ఫామ్‌ ప్రదర్శించి తెలుగు జాతికి మణిమకుఠంగా సింధు నిలిచిందని కీర్తించిన సీఎం చంద్రబాబు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నాలుగు పతకాలు గెలిచి బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ లో సింధు సువర్ణాధ్యాయం సృష్టించిందని అన్నారు.

వరుసగా రెండుసార్లు ఫైనల్‌ చేరుకొని సింధు చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నఅయన ఫైనల్ లో కరోలినా మారిన్‌( స్పెయిన్‌), సెమీస్‌లో యమగూచి(జపాన్‌)వంటి ప్రపంచ దిగ్గజ షట్లర్‌ లను వరుసగా జరిగిన మెగా టోర్నీల్లో ఆడి సింధు అసమాన్య ప్రతిభ చూపిందన్న సీఎం చంద్రబాబు