ఆ బౌలర్ల ముందు చేతులెత్తేసిన కోహ్లీ సేన

england-vs-india, first-test, day-four

బర్మింగ్‌హామ్‌లో యుద్ధం ముగిసింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విజయం సాధించాడు. కానీ.. అతడి సేన మాత్రం ఓడింది. ఇంగ్లండ్‌ బౌలర్ల ముందు ఘోరంగా చేతులెత్తేసింది. ఒక్కడి పోరాటంతో మ్యాచ్‌లను గెలవలేమని భారత్‌కు మళ్లీ అనుభవమైంది. ఆల్‌రౌండర్లు ఆపద్బాంధవులుగా నిలవడంతో తొలి టెస్టులో కోహ్లి సేనపై ఇంగ్లండ్‌ జయభేరి మోగించింది.

ఎడ్జ్‌బాస్టన్‌లో ఊరించిన విజయం చేజారింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్లు కుప్పకూలిపోయారు. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. మిగతా బ్యాట్స్‌మెన్ల నుంచి సరైన సహకారం అందకపోవడంతో భారత్ ఓటమి తప్పలేదు.

India vs England 1st Test

194 పరుగుల లక్ష్య ఛేదనలో 110 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్‌… 162 పరుగులకు ఆలౌటైంది. విజయానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కెప్టెన్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ అనంతరం కీలక సమయంలో ఔటవ్వడం భారత అవకాశాలను దెబ్బతీసింది. హార్దిక్‌ పాండ్యా 61 బంతుల్లో 31 పరుగులు చేసినా.. జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్‌ బెన్‌స్టోక్స్‌… కోహ్లీ, పాండ్యాలను ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బతీశాడు.

తొలి టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 287 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ వీరోచిత ప్రదర్శనతో భారత్ 274 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో సామ్ కర్రన్ అర్ధశతకంతో చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

india-vs-england-live-cricket-score-day-2-at-edgbaston-virat-kohli-co-look-to-consolidate-strong-position

ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. 193 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బ్యాట్స్‌మెన్లు.. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌లో పరుగులు చేయలేకపోయాడు. కోహ్లీ, పాండ్యా మినహా మిగితా వారందరూ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. ఫలితంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ తొలి టెస్టును కైవసం చేసుకొని 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.

england-vs-india, first-test, day-four

తొలి టెస్ట్‌లో ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపిన సామ్‌ కరన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 9 నుంచి లార్డ్స్‌లో జరుగుతుంది.