స్నేహం గురించి ఏం చెప్పగలం కొత్తగా …

స్నేహం గురించి ఏం చెప్పగలం కొత్తగా …
బాల్యస్నేహం
స్కూలు స్నేహం
కాలేజీ స్నేహం
అబ్బో!
ఇలా ఎన్ననీ ..

అసలు స్నేహమే ఒక మధురమైన అనుభూతి
ఏరా.. ఒరేయ్
ఒసేయ్, ఏమే .. అప్యాయంగా పిలిచే ఈ పిలుపులు ఒక్క స్నేహం లోనే దొరుకుతాయి.
అరమరికలు లేకుండా అన్ని కబుర్లు చెప్పేసుకోవాలంటే..
మనసుకి నచ్చిన మిత్రుడు లేదా మిత్రురాలితో మాత్రమే చెప్పుకోగలం..
సంతోషమైనా
బాధైనా
ఏదైనా సరే.
మనలో లోపం వుంటే సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు.
అలాంటి స్నేహితుడు వుంటే దూరం చేసుకోవద్దు …
స్నేహం యొక్క విలువను గ్రహించారు కనుకే
దుర్యోధనుడు-కర్ణుడు ..
కృష్ణుడు-కుచేలుడు లాంటివారు అంత మంచి మిత్రులు కాగలిగారు.
మనకి మంచి మాత్రమే చెప్పేవాడు మిత్రుడు కాదు / మిత్రురాలు కాదు …
మనలో లోపాలు కూడా సరిదిద్ది మనని సరైన దారిలో నడిపేవాడు నిజమైన మిత్రుడు / మిత్రురాలు.
సో మీకు ఇలాంటి స్నేహితులు వుంటే దూరం చేసుకోవద్దు.

ఈ బిజీ రోజుల్లో
కాసింత సమయం దొరకబుచ్చుకుని
మీ స్నేహితులతో కనీసం వారం లేదా పదిహేను రోజులు ..
అయ్యో! కుదరదు అంటారా పోనీ నెలకు ఒకసారైనా కలవండి.
ఆ స్నేహపు మాధుర్యాన్ని పొందండి.

మీ చిన్నతనంలో
మీతో అరమరికలు లేకుండా మెలిగే మిత్రుడో /మిత్రురాలో వుంటారు.
వెదకండి కలవండి
స్నేహం అనే మధురమైన అనుభూతి పొందండి.

మీ కష్టంలో
మీలో ధైర్యం నింపడానికి
మీకు మానసిక బలం ఇవ్వటానికి మీకు మిత్రులు లేరా!
అయితే వెతకండి
మీ స్కూలు రోజుల్లోనో
కాలేజీ రోజుల్లోనో
మీకు ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు వుండేవుంటారు.
వాళ్ళకు డబ్బు పరంగా సహాయం చేయలేకపోవచ్చు
కాని మానసికంగా ధైర్యం ఇవ్వగలరు.
స్నేహితుల నుంచి అంతకుమించి ఏం ఆశిస్తాం!
A FRIEND IN NEED IS A FRIEND INDEED కదా!

– నాగశ్రీ